రెండవ వారంలో కూడా ప్రభావం చూపుతోన్న జై లవ కుశ
Published on Sep 30, 2017 4:10 pm IST


ఫస్ట్ వీక్ లో మంచి వసూళ్ళని సాధించిన తరువాత జై లవ కుశ చిత్రం రెండవ వారంలోకి ఎంటర్ అయింది. తాజా సమాచారం ప్రకారం వెస్ట్ గోదావరిలో ఈ చిత్రం ఇప్పటివరకు 3.18 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండవ వారంలో కూడా ఈ చిత్ర ప్రభావం బలంగా సాగుతోంది.

కాగా ఈ వీకెండ్ లో జైలవ కుశ చిత్రం మరిన్ని వసూళ్లని సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం లో దర్శకుడు బాబీ జై పాత్రలో ఎన్టీఆర్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. ఎన్టీఆర్ నటన ఈ చిత్రానికి పెద్ద ప్లస్ గా మారింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ నిర్మించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

 
Like us on Facebook