హైదరాబాద్ లో సెంచరీ కొట్టిన ‘జై లవకుశ’


జై లవకుశ చిత్ర విడుదలకు వారం సమయం కూడా లేకపోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటించాడనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతోంది. సినిమాపై ఏర్పడిన భారీ హైప్ ని దృష్టిలో పెట్టుకుని అదే స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే ఈ చిత్రం 100 స్క్రీన్ లలో రిలీజ్ అవుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీర్ కు నైజాం ఏరియాలో మంచి క్రేజ్ ఉంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ ఏరియాలో చిత్ర వసూళ్లు ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ఏరియాలలో కూడా ఈ చిత్ర ఎక్కువ స్క్రీన్ లలో విడుదల అవుతోంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు కాగా నివేద థామస్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.