‘జాన్’ షూట్ మళ్లీ పోస్ట్ ఫోన్.. కొత్త డేట్ ఫిక్స్ !

Published on Jan 1, 2020 1:10 am IST

ప్రభాస్ ‘జాన్’ షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ అయినట్లు తెలుస్తోంది. ఎప్పుడో మొదలవ్వాల్సిన షెడ్యూల్ ఇప్ఫటికే రెండు సార్లు వాయిదా పడింది. అయితే రీసెంట్ గా జనవరి మొదటి వారంలో షూటింగ్ ప్లాన్ చేసింది చిత్రబృందం. కానీ, ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది. జ‌న‌వ‌రి 17 నుంచి హైద‌రాబాద్‌ లోని అన్న‌పూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరగనుంది. అదే షెడ్యూల్ లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా వన్ వీక్ షూటింగ్ జరుపుకోనుంది.

కాగా `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర ఓ స్కూల్ టీచర్ గా కనిపించనుందని.. ఈ సినిమా పీరియాడిక్ మూవీ కావడంతో పూజా గెటప్ కూడా ఆనాటి ట్రెడిషనల్ లేడీ టీచర్స్ పోలి ఉండేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.

మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ ప్రచారంలో ఉంది.

సంబంధిత సమాచారం :

More