‘వినయ విధేయ రామ’ కోసం ఎన్టీఆర్, రాజమౌళి వస్తారా ?

Published on Dec 8, 2018 7:47 pm IST


బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ చిత్రం డిసెంబర్ మూడో వారంలో కల్లా పూర్తి షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. జనవరి 11వ తేదీన విడుదల సిద్ధం కానుంది.

కాగా త్వరలోనే వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారట. అయితే ఈ ఈవెంట్ కు రాజమౌళి మరియు ఎన్టీఆర్ వస్తారని తెలుస్తోంది. దానయ్యనే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా నిర్మస్తుండడంతో ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు.

ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :