ఆ రికార్డ్ ఒక్క ‘ఎన్టీఆర్’కే సాధ్యం అయింది !

Published on Oct 14, 2018 10:36 am IST

త్రివిక్రమ్ దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ప్రస్తుతం కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఎన్టీఆర్ వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టి.. భారీ విజయాలతో దూసుకువెళ్తున్నాడు, ఇంతవరకు ఏ సౌత్ హీరోకి సాధ్యం కాని రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా నాలుగు సినిమాలతో నాలుగోసరి ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించి.. తారక్ కొత్త రికార్డ్ ను సృష్టించాడు. ‘అరవింద సమేత’ ముందు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ చిత్రాలు 1.5 మిలియన్ క్లబ్ లో ఉన్నాయి.

కాగా ‘అరవింద సమేత’ హిట్ తో ఎన్టీఆర్ స్టార్ హీరోల్లో.. మిగిలిన హీరోల కంటే.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంలో ముందంజలో ఉన్నాడు. ఎలాగూ తర్వాత రాజమౌళి సినిమా. ఇక ఆ సినిమా తరువాత తారక్ మార్కెట్ ఇంతకి రెండింతలు పెరగడం ఖాయం.

ఇక తారక్ గత చిత్రాల్లో కంటే, అరవింద సమేతలో అద్భుతంగా నటించాడు. రాయలసీమ యాసలో ఆయన చెప్పిన డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డ్ లను తిరగరాస్తోంది.

సంబంధిత సమాచారం :