ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత – జూ. ఎన్టీఆర్ భావోద్వేగం!

Published on May 28, 2022 8:58 am IST

మన తెలుగు సినిమాకి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చిన మొట్ట మొదటి సీనియర్ స్టార్ హీరో నందమూరి తారక రామారావు. ఒక్క తెలుగు సినిమా కోసమే కాకుండా తెలుగు ప్రజానీకం కోసం చలించి ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఏపీ రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చి తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడ్డారు.

అందుకే ఆయనంటే ప్రతి ఒక్క తెలుగువారికి ఒక ఎమోషన్ ఉంది. అయితే నందమూరి వారి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి తన తాత పై ఉండే ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. తాను ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా సీనియర్ ఎన్టీఆర్ నామ స్మరణ మాత్రం మానుకోడు.

అంతలా తన తాతయ్య పట్ల ప్రేమను, గౌరవాన్ని, విధేయతను నర నరాల్లో నింపుకున్న తారక్ ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా తన తాతయ్యని తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనస్సుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను” అంటూ ఎన్టీఆర్ అత్యంత భావోద్వేగంతో పోస్ట్ చేయగా తారక్ అభిమానులు కూడా మరింత ఎమోషనల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :