ఆ పాత్రకు ఎన్టీఆర్ ఒక్కడే న్యాయం చేయగలడట !

Published on Aug 2, 2019 3:01 am IST

అత్యంత భారీ బడ్జెట్ తో నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ‘రామాయణ’ అనే పేరుతో ‘రామాయణం’ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రంలో ఎంతోమంది ప్రముఖులు నటించనున్నారని, ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ రామాయణంలో ఎంతో కీలకమైన రావణుడు పాత్రను ఎవరు పోషించనున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా రావణుడి పాత్రకి ఎన్టీఆర్ అయితేనే న్యాయం చేస్తాడని జూనియర్ ఎన్టీఆర్ ఆ పాత్ర చెయ్యాలని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఏమైనా ఈ తరంలో హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకురావడం నిజంగా విశేషమే. ఎలాగూ పౌరాణిక చిత్రాలకు సరిపోగల, అలాంటి సినిమాల్లో నటించాలనే ఆశ ఉన్న హీరోలు తక్కువుగా ఉన్నారు. అందుకే తారక్ పైనే అందరి చూపులు ఉన్నాయి. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా ఉండనుంది. అది కూడా త్రీడీ ఫార్మాట్లో కావడం విశేషం. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం :