ఎన్టీఆర్ ఆ సిద్దాంతానికే కట్టుబడ్డారట

Published on Nov 20, 2019 11:23 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు, సీనియర్ ఎన్టీఆర్‌కు చాలా దగ్గరి పోలికలుంటాయి. అందుకే ఏదైనా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర గనుక ఉంటే దానికి చిన్న ఎన్టీఆర్‌ను ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటారు ఆయా సినిమాల దర్శక నిర్మాతలు. కానీ తారక్ మాత్రం ఎన్నిసార్లు అయన వద్దకు పెద్ద ఎన్టీఆర్ పాత్ర చేయాలనే ప్రపోజల్ తీసుకెళ్లినా రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు.

గతంలో కూడా ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి పాత్రలో నటించేంత గొప్ప వాడిని కాదనేది తన గట్టి నమ్మకమని తారక్ అన్నారు. ఆ మాట ప్రకారమే తాజాగా వచ్చిన ‘తలైవి’ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేశారు తారక్. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కూడా ఉందట. అందులో నటించాలని తారక్ ను కోరగా గతంలో చెప్పిన ప్రకారమే తోసిపుచ్చారట.

సంబంధిత సమాచారం :

More