బాలయ్య కోసం జైల్ సెట్.. షూటింగ్ డేట్ అదే !

బాలయ్య కోసం జైల్ సెట్.. షూటింగ్ డేట్ అదే !

Published on Nov 21, 2022 9:02 PM IST

నందమూరి బాలకృష్ణ త్వరలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 8న హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ షూట్ కోసం ఓ జైల్ సెట్ వేస్తున్నారని, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ జైల్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.

కాగా అనిల్ రావిపూడి తన రూట్ మార్చుకుని బాలయ్యను కొత్త తరహాలో చూపించనున్నాడట. ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. అనిల్ రావిపూడి క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో వరుస విజయాలను అందుకుంటున్నాడు అనిల్ రావిపూడి. అందుకే, అనిల్ – బాలయ్య కలయికలో సినిమా అనగానే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు