“రౌడీ బాయ్స్” ట్రైలర్ ను రిలీజ్ చేయనున్న తారక్!

Published on Jan 7, 2022 11:02 pm IST

ఆశిష్ హీరోగా పరిచయం అవుతూ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌడీ బాయ్స్. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు మరియు శిరీష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం ను జనవరి 14 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనుంది. ఈ చిత్రం ట్రైలర్ ను టాలీవుడ్ ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :