నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రగా.. ఆయన తండ్రి ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్ లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ ఆడియో & ట్రైలర్ లాంచ్ నిన్న హైద్రాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘చిన్నప్పుడు నేను ఆయన్ని తాతగారూ అని పిలిచేవాడిని. కానీ ఆయన గొప్పతనం తెలిశాక రామారావు గారు, అన్నగారు అని సంబోధిస్తున్నా.. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
ఇంకా తారక్ మాట్లాడుతూ.. ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి, ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘ఎన్టీఆర్ ది ఓ చరిత్ర.. విజయం సాధించాకే ఈ బయోపిక్ మొదలైంది. చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవు. కేవలం చరిత్ర సృష్టించడమే ఉంటుంద’ని అన్నారు.
కాగా మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.


