‘జ్యో అచ్యుతానంద’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి!
Published on Aug 30, 2016 6:00 pm IST

jyo-achyutananda
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో వచ్చేస్తున్నారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమా నేటితో సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు పక్కాగా సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సెన్సార్ బృందం ఈ క్లీన్ ఎంటర్‌టైనర్‌కు యూ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ సభ్యుల నుంచి సినిమాకు మంచి స్పందన వచ్చిందని, ప్రేక్షకులనూ సినిమా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని టీమ్ తెలిపింది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడమన్న అంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ ముగ్గురి కెమిస్ట్రీయే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటించారు. కళ్యాణ్ కోడూరి అందించిన ఆడియో ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

 
Like us on Facebook