యూట్యూబ్‌లో పూరీ ‘జ్యోతిలక్ష్మీ’ సందడి!

యూట్యూబ్‌లో పూరీ ‘జ్యోతిలక్ష్మీ’ సందడి!

Published on May 19, 2015 5:44 PM IST

jyothi-lakshmi
‘టెంపర్’ విజయంతో జోష్ మీదున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ వెంటనే మరో మాస్ కమర్షియల్ సినిమా కాకుండా, తన స్టైల్లోనే జ్యోతిలక్ష్మీ పేరుతో డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించాడు. ఛార్మీ హీరోయిన్‌గా ‘జ్యోతిలక్ష్మీ’ అన్న పేరుతో పూరీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడనే విషయం తెలియగానే ఈ సినిమా పట్ల సాధారణంగానే కొంత ఆసక్తి చెలరేగింది. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన సూపర్ హిట్ నవల ‘మిసెస్ పరాంకుశం’ ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కిందని తెలిసిన తర్వాత ఈ సినిమా విషయంలో మరింత ఆసక్తి కలిగింది.

తాజాగా ఆ అంచనాలను, ఆసక్తిని మరింత పెంచేస్తూ ఛార్మీ పుట్టినరోజు సందర్భంగా జ్యోతిలక్ష్మీ ట్రైలర్ విడుదలైంది. విడుదలై రెండు రోజులు కూడా పూర్తి కాకముందే ఈ సినిమా సుమారు రెండున్నర లక్షల పైచిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల్లో జ్యోతిలక్ష్మీ ట్రైలర్ కూడా ఒకటిగా నిలవడం విశేషం. ‘మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.. రెస్పెక్ట్ ఇస్తే చాలు’ అన్న పూరీ మార్క్ ఫినిషింగ్ టచ్‌తో ఈ ట్రైలర్ అందరి అభిమానాన్నీ చూరగొంటోంది. ఈ ట్రైలర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలే పెరిగాయని చెప్పాలి. మరి ఆ అంచనాలన్నీ సినిమా అందుకుంటుందా అనేది తెలియాలంటే వచ్చే నెల వరకూ ఆగాల్సిందే!

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు