ఆసక్తిని పెంచేసిన ‘జ్యోతి లక్ష్మీ’ ట్రైలర్

ఆసక్తిని పెంచేసిన ‘జ్యోతి లక్ష్మీ’ ట్రైలర్

Published on May 18, 2015 9:31 AM IST

jyothi-lakshmi-
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కేవలం 37 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన లేటెస్ట్ మూవీ ‘జ్యోతి లక్ష్మీ’. చార్మింగ్ గర్ల్ ఛార్మీ టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిన్న చార్మీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చార్మీని చూపించిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చివర్లో కొస మెరుపుగా చార్మీ చేత చెప్పించిన ‘ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, రెస్పెక్ట్ ఇస్తే చాలు’ అనే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇంత ఫాస్ట్ గా ఫినిష్ చేసారు, ఎలా ఉంటుందా అని చాలా మంది అనుకుంటున్నారు, వారందరిలోనూ ఈ ట్రైలర్ ఆసక్తిని పెంచేసింది. ట్రైలర్ మొదట రెగ్యులర్ గా స్టార్ట్ అయినా చివరికి వచ్చే సరికి ఆసక్తిని పెంచేసింది. ముఖ్యంగా విజువల్స్, చార్మీ పెర్ఫార్మన్స్ మరియు థీమ్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. సికె ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. మరి ఈ సినిమాతో చార్మీ బౌన్స్ బ్యాక్ అయ్యి సూపర్ హిట్ అందుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు