లీకైన ‘కాలా’ క్లైమాక్స్ ఫైట్ !

ఈ మధ్య పెద్ద సినిమాలు లీకేజ్ బారిన పడటం షరా మామూలైపోయింది. గతేడాది భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి-2’ క్లైమాక్స్ యుద్ధ సన్నివేశం, ఆ తర్వాత ట్రైలర్ విడుదలకు ముందే బయటకు వచ్చి దర్శక నిర్మాతల్ని ఇబ్బందుల్లో పడేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి సూపర్ స్టార్ రజనీ తాజా చిత్రం ‘కాలా’కు కూడా ఎదురైంది.

సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ అంటూ కొన్ని సెకన్ల నిడివి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో అభిమానులు కొందరు యూనిట్ సభ్యులు దీన్ని తొలగించి, ఈ లీకేజ్ కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి దర్శక నిర్మాతలు ఈ పరిణామంపై ఎలా స్పందిస్తారో చూడాలి. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.