అజిత్ కు జోడీగా రజనీ హీరోయిన్

Published on Jan 21, 2020 2:35 pm IST

దక్షిణాది స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ షూటింగ్లో ఉన్నారు. అజిత్ గత చిత్రం ‘నెర్కొండ పారవై’ను డైరెక్ట్ చేసిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇందులో కథానాయకిగా ఇలియానా, యామీ గౌతమ్ లాంటి పేర్లు వినబడినా ఇప్పుడు బాలీవుడ్ నటి హుమా ఖురేషి పేరు తెరపైకి వచ్చింది.

ఈమెనే అజిత్ జోడీగా ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. హుమా ఖురేషి గతంలో రజనీ చేసిన ‘కాల’ చిత్రంలో కథానాయకిగా నటించి మెప్పించింది. ఆమె అయితే కథ రీత్యా, వయసు రీత్యా అజిత్ సరసన బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇకపోతే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ యేడాది వేసవికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

X
More