ఓటిటి లోకి వచ్చిన దర్శన్ “కాటేరా”

ఓటిటి లోకి వచ్చిన దర్శన్ “కాటేరా”

Published on Feb 9, 2024 6:06 PM IST

కన్నడ స్టార్ హీరో దర్శన్ ఇటీవల యాక్షన్ డ్రామా కాటేరాతో ఆడియెన్స్ ముందుకి వచ్చాడు. ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. కాటేరా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది, అది సలార్ చిత్రం తో పోటీ పడి.

తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు Zee5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో పాటు కన్నడ భాషలో కూడా ప్రసారం అవుతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారందరికీ ఇది మంచి అవకాశం. ఆరాధనా రామ్ ఈ యాక్షన్ డ్రామాతో తెరంగేట్రం చేసింది. కాటేరాలో జగపతి బాబు, కుమార్ గోవింద్, వినోద్ కుమార్ అల్వా, డానిష్ అక్తర్ సైఫీ మరియు శృతి సహాయక పాత్రల్లో నటించారు. రాక్‌లైన్ వెంకటేష్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. కాటేరా కథ నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొందింది. వి.హరికృష్ణ ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు