‘కబాలి’ విజయోత్సవ వేడుక నిర్వహించనున్న రజనీ!

27th, July 2016 - 03:17:50 PM

kabali1
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు అభిమానులు, ప్రేక్షకుల దగ్గర్నుంచి మిక్స్‌డ్ రెస్పాన్సే వచ్చినా, సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులంతా, ఎలా ఉన్నా సినిమా చూసేయాలని అనుకుంటూ ఉండడంతో కలెక్షన్స్ ఇప్పటికీ స్టడీగానే కొనసాగుతున్నాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తోన్న రెస్పాన్స్‌కు థ్యాంక్స్ తెలుపుతూ చెన్నైలో కబాలి టీమ్ ఓ విజయోత్సవ వేడుక నిర్వహించేందుకు సిద్ధమైంది. రేపు సాయంత్రం జరిగే ఈ వేడుకలో రజనీ సహా టీమ్ అంతా హాజరు కానుందని నిర్మాత కళైపులి థాను స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా యూఎస్‌లో విశ్రాంతి తీసుకుంటూ వచ్చిన రజనీ, ఆదివారం రోజున చెన్నై రావడంతో మళ్ళీ తన సినిమా పనులతో బిజీ బిజీ అయిపోయారు. రేపటి విజయోత్సవ వేడుకలో రజనీ అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటించనున్నారని కూడా తెలుస్తోంది.