థియేటర్లు తగ్గినా “కబీర్ సింగ్” వసూళ్ల జోరు తగ్గలేదు.

థియేటర్లు తగ్గినా “కబీర్ సింగ్” వసూళ్ల జోరు తగ్గలేదు.

Published on Jul 18, 2019 8:07 PM IST

షాహిద్ కపూర్ నటించిన “కబీర్ సింగ్” విడుదలై దాదాపు నెల రోజులు కావస్తున్నా, ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల జోరు తగ్గలేదు. కబీర్ సింగ్ తరువాత చాలా సినిమాలు విడుదలైనప్పటి దీనికి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. తాజాగా పోయిన వారం హృతిక్ రోషన్ నటించిన “సూపర్ 30” విడుదలైనప్పటికీ “కబీర్ సింగ్” వసూళ్లు నిలకగా కొనసాగుతున్నాయి. “కబీర్ సింగ్” మొత్తం వసూళ్లు దాదాపు 265కోట్లకు చేరాయి. ఈ సంవత్సరానికి ఇప్పటివరకు ఇవే అత్యధిక వసూళ్లు కావడం గమనార్హం.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం జరిగింది.కొత్త సినిమాల విడుదలతో కబీర్ సింగ్ చాలా థియేటర్ల నుండి తీసివేసినప్పటికీ గత వారాంతంలో 10కోట్ల వసూళ్లు, పనిదినాలలో బుధవారం వరకు షుమారు 5కోట్ల వసూళ్లు సాధించిందని చెప్పారు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ షాహిద్ కెరీర్ లోనే మెమరబుల్ మూవీగా నిలవడంతో పాటు,బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా రికార్డులకెక్కింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు