స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫిమేల్ సెంట్రిక్ మూవీ సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 31, 2024 న థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. నేడు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుక కి నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
ఈ మేరకు నందమూరి బాలకృష్ణ పై ప్రశంసల వర్షం కురిపించారు. సత్యభామ తో మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలయ్య గారి ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. సత్యభామ చిత్రంతో నా కెరీర్ లో కొత్త ఫేస్ లోకి వెళ్తున్నాను. కొత్త రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. ఈ టైమ్ లో బాల సర్ రావడం నాకు ధైర్యం ఇచ్చింది. బాల సర్, మీ దగ్గర ఏం కాలిక్యులేషన్స్ లేవు. మీ దగ్గర ఓన్లీ ఎమోషన్స్ ఉంటాయి. ఇంత ప్యూర్ హార్ట్ ఇప్పటివరకు చూడలేదు. బాలయ్య గారి డిక్షన్ కి నేను పెద్ద ఫ్యాన్. మీ ఎనర్జీ అన్ మ్యాచబుల్. మీ లవ్ అన్ కండిషనల్. మీరు నిజంగా అన్ స్టాపబుల్ అంటూ కాజల్ పొగడ్తల వర్షం కురిపించారు.
నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ యద్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను ఔరం ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క కథా రచయితగా, శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.