బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఆయన సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటిస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ మేం ఇప్పటివరకు రామాయణ మొదటి భాగానికి సంబంధించిన షూటింగ్ మాత్రమే పూర్తి చేశాం. నేను మండోదరి పాత్రలో నటిస్తున్నాను. నా పాత్ర నిడివి చిన్నదే. కానీ, యశ్ పక్కన నటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక నా కెరీర్లోనే ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేయడం మొదటిసారి అని, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కాజల్ తెలిపింది.
సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు. పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.


