కాజల్ కి ఆ రోజులు గుర్తుకు వచ్చాయట..!

Published on Mar 28, 2020 9:48 am IST

కాజల్ అగర్వాల్ తన చిన్నప్పటి రోజులను గుర్తు చేసుకుంది. దానికి కారణం దూరదర్శన్ లో రామాయణ మరియు మహాభారతాలు ప్రసారం కావడమే. కాజల్ చిన్నప్పుడు దూరదర్శన్ లో ప్రసారం అయ్యే రామాయణ మరియు మహాభారతాలను రెగ్యులర్ గా చూసేదట. అవి ఇప్పుడు పునఃప్రసారం కావడంతో కాజల్ కి బాల్యం గుర్తుకు వచ్చిందట. ఇక ఇలాంటి పౌరాణిక గాథలతో పిల్లలలో మంచి ప్రవర్తన పెంపొందుతుందని కాజల్ సోషల్ మీడియా వేదికా చెప్పుకొచ్చారు.

ఇక కాజల్ ప్రస్తుతం చిరు 152వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మొదట త్రిషను అనుకోగా ఆమె తప్పుకోవడంతో ఆమెకి బదులు కాజల్ ని తీసుకున్నారు. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో కూడా కాజల్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More