“మోసగాళ్లు” ఇంగ్లీష్ వెర్షన్ చాలా డిఫరెంట్ – కాజల్

Published on Mar 17, 2021 9:00 am IST

మంచు వారి హీరో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “మోసగాళ్లు”. హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. అయితే పాన్ ఇండియన్ లెవెల్లో అన్ని కీలక భాషలతో పాటుగా ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎందుకంటే ఈ చిత్రంలో వీరు ఎంచుకున్న వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ నేపథ్య మూలాన ఆ స్థాయిలో తెరకెక్కించాల్సి వచ్చింది. అయితే ఈ టేకింగ్ పై ఇంటెస్టింగ్ ఇన్ఫో ను కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది. మాములుగా పలు భాషల్లో ఒకేసారి నటించడం కాస్త కష్టంగా ఉండేది అని మన ఇండియన్ వెర్షన్ కి అయితే ఎడిటింగ్ చేసి అక్కడక్కడా ఆపుతూ సీన్స్ తెరకెక్కిస్తామని..

కానీ హాలీవుడ్ వెర్షన్ కు వచ్చేసరికి మాత్రం మొత్తం ఒకే లెంగ్త్ సీన్ ను కెమెరా రోల్ అవుతున్నంత సేపు తియ్యాల్సి ఉంటుంది అది తనకి చాలా కష్టంగా అనిపించింది అని కాజల్ తెలిపింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ భారీ స్కామ్ చిత్రం ఎలా ఉంటుందో ఎలా పెర్ఫామ్ చేస్తుందో తెలియాలి అంటే ఈ మార్చ్ 19 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :