యంగ్ హీరో సరసన కాజల్ అగర్వాల్ ?

Published on Nov 19, 2019 2:03 pm IST

ఒకప్పుడు కేవలం స్టార్ హీరోల సినిమాలతోనే బిజీగా గడిపిన కాజల్ అగర్వాల్ ఈమధ్య పెద్ద హీరోల చిత్రాలతో పాటు మీడియమ్, చిన్న హీరోల చిత్రాలకు కూడా సైన్ చేస్తోంది. ఇటీవలే శర్వానంద్ యొక్క ‘రణరంగం’లో మెరిసిన ఈమె ఇప్పుడు యంగ్ హీరో శ్రీవిష్ణు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రీవిష్ణు లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థలో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ప్రదీప్ వర్మ డైరెక్ట్ చేయనున్నాడు. పోలీస్ డ్రామాగా ఈ చిత్రం ఉండనుంది.

సినిమాను అన్ని విధాలా గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తున్న నిర్మాతలు కథానాయకిగా స్టార్ నటి కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ వార్తే గనుక నిజమైతే కాజల్ ఫేమ్ శ్రీవిష్ణు సినిమాకి మంచి ప్లస్ అవుతుంది. అయితే ఈ విషయమై నిర్మాతల నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇకపోతే కాజల్ ప్రస్తుతం శంకర్, కమల్ యొక్క ‘ఇండియన్ 2’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

సంబంధిత సమాచారం :

More