వైభవంగా కాజల్ అగర్వాల్ వివాహ వేడుక

Published on Oct 30, 2020 11:27 pm IST


కాజల్ అగర్వాల్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె వివాహ వేడుక వైభవంగా ముగిసింది. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ ఏడడుగులు వేసింది. కోవిడ్ నిబంధనల కారణంగా ఈ వేడుకకు వధూవరుల కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. ముంబైలోని ఒక స్టార్ హోటల్లో అందంగా అలంకరిచబడిన పూల వేదిక మీద వివాహం జరిగింది. పెళ్లికి ముందు ఆతర్వాత జరిగిన కార్యక్రమాలను కాజల్ అమితంగా ఎంజాయ్ చేసింది.

వేడుకలకు సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలకావడంతో బాగా వైరల్ అయ్యాయి. ఇక కాజల్ అభిమానులైతే సంతోషం వ్యక్తం చేస్తూ కాజు, కిచ్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ప్రముఖులు సైతం కాజల్ కు విషెస్ పంపుతున్నారు. వివాహానికి ముందే ముంబైలో తమకంటూ ఒక సపరేట్ ఫ్లాట్ రెడీ చేసుకున్న కాజల్, గౌతమ్ త్వరలోనే అందులోకి వెళ్లనున్నారు. ఇకపోతే పెళ్లి హడావుడి మొత్తం ముగిశాక కాజల్ తిరిగి సినిమా షూటింగ్లలో పాల్గొననుంది. ముందుగా చిరంజీవి ‘ఆచార్య’ షూట్లో జాయిన్ అవుతుంది ఆమె.

సంబంధిత సమాచారం :

More