సూపర్ స్టార్ ఒక్కరే మిగిలారంటున్న కాజల్

Published on Oct 17, 2019 3:09 pm IST

కాజల్ అగర్వాల్.. సంవత్సరాలు గడుస్తున్నా క్రేజ్ తగ్గని హీరోయిన్. ఈమె ఇండస్ట్రీలోకి ప్రవేశించి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఒకప్పుడు పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకుల చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ కాజలే. ఆ తర్వాతే వేరే హీరోయిన్ల ప్రస్తావన అంటే అతిసయోక్తి కాదు. అంతలా పాపులారిటీ సంపాదించుకుంది.

దక్షిణాదిన చిరు, పవన్, మహేష్ బాబు, అజిత్, విజయ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది కాజల్. అలాగే అనేకమంది చిన్న హీరోలతో సైతం సినిమాలు చేసింది. ప్రస్తుతం కమల్ హాసన్ చేస్తున్న ‘ఇండియన్ 2’లో నటిస్తున్న ఈమెకు ఇంకో పెద్ద కోరికే ఉంది.

అదే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడం. అందరితోనూ నటించాను.. ఇక మిగిలింది సూపర్ స్టార్ ఒక్కరే అంటోంది కాజల్. మరి ఆమె కోరిక నెరవేరుతుందేమో చూడాలి. ఇకపోతే ఈమె ‘ఇండియన్ 2’ కాకుండా ‘ముంబై సాగా, పారిస్ పారిస్, కాల్ సెంటర్’ లాంటి చిత్రాల్లో కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More