కాజల్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో కూడా.. ఈ ఓటీటీలో ఉంది!

కాజల్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో కూడా.. ఈ ఓటీటీలో ఉంది!

Published on Oct 1, 2026 9:00 AM IST

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు లిమిటెడ్ గానే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా కంటే తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటున్న లీడ్ పాత్రలలో ఆమె నటిస్తుంది. అలా తను ప్రధాన లీడ్ లో నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ సినిమానే ‘ది ఇండియా స్టోరీ’. కెమికల్స్ మాఫియా నేపథ్యంలో దర్శకుడు చేతన్ డీకే తెరకెక్కించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ లోనే గత కొన్ని రోజులు కితం స్ట్రీమింగ్ కి వచ్చింది.

అయితే అప్పుడు తెలుగు స్ట్రీమింగ్ కి రాలేదు. కానీ ఫైనల్ గా ఈ సినిమా ఇప్పుడు తెలుగులో కూడా వచ్చేసింది. ఈ సినిమాని మొదట తీసుకొచ్చిన జియో హాట్ స్టార్ వారే ఇప్పుడు తెలుగులో కూడా నేటి నుంచి తీసుకొచ్చారు. సో ఈ సినిమా చూడాలి అనుకుంటే హాట్ స్టార్ లో వీక్షించవచ్చు. ఇక ఈ సినిమాలో కాజల్ తో పాటుగా శ్రేయస్ తల్పడే, మురళీ శర్మ తదితరులు నటించారు. అలాగే సాగర్ బి షిండే నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు