ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇటీవల విడుదలైన మోకాప్ మేకింగ్ వీడియో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో రెండు భాగాల షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
చిత్ర భారీ బడ్జెట్, నాన్-థియేట్రికల్ మరియు ఓటీటీ డీల్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయడానికే మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదల ప్లాన్స్‌పై చర్చలు జరుగుతున్నాయి. మొదటి భాగాన్ని డిసెంబర్ 2027లో, రెండవ భాగాన్ని 2028లో విడుదల చేసేందుకు ఆలోచిస్తున్నట్లు సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీపికా పదుకోనె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మరియు ఐశ్వర్య లక్ష్మి వంటి స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


