‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ నటించిన చిత్రం ‘యేజు కడల్ యేజు మలై’. ప్రముఖ దర్శకుడు రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సూరి కీలక పాత్ర పోషించగా, అంజలి హీరోయిన్‌గా నటించింది. వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ కామాక్షి నిర్మించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంచారి’ అనే పేరుతో అక్టోబర్ 1న తమిళ వెర్షన్‌తో పాటు ఏకకాలంలో విడుదల చేయడానికి మొదట ప్లాన్ చేశారు.
అయితే, తాజా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ విడుదల వాయిదా పడింది. టైటిల్‌కి సంబంధించిన సమస్య తలెత్తడం వల్ల ఈ సినిమా తెలుగు విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. త్వరలోనే ఈ మూవీ కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు. దీంతో రిలీజ్‌కు ఒక్క రోజు ముందే ఈ సినిమాను వాయిదా వేస్తు్న్నట్లు ప్రకటించడంతో సినీ లవర్స్ అవాక్కవుతున్నారు.


