‘డొంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించాడు. ప్రతి ఒక్క చిన్నారికి, తల్లిదండ్రులకు ఈ సినిమా నచ్చుతుందని ఆయన పేర్కొన్నాడు. ఫహాద్ ఫాజిల్ ‘సూరి’ పాత్రలో అద్భుతంగా నటించారని, ఆయన నటన ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు.
దర్శకుడు శశాంక్ తన తొలి చిత్రంతోనే ఇంతటి ప్యూర్ ఎమోషన్స్‌ను ఎంతో చక్కగా తెరకెక్కించారని అభినందించిన ఎన్టీఆర్, చిన్నారి సారా తన న్యాచురల్ పర్ఫార్మెన్స్‌తో మనసు దోచుకుందని తెలిపారు. కాల భైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని కొనియాడారు. చాలా కాలం తర్వాత కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ ఓ అద్భుతమైన సినిమా వచ్చిందని, పోలీస్ స్టేషన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఒక ఎమోషనల్ రోలర్‌కోస్టర్‌లా అనిపించిందని ఎన్టీఆర్ వెల్లడించారు.
ఈ స్పెషల్ చిత్రాన్ని నిర్మించిన కార్తికేయను చూసి ఎంతో గర్వపడుతున్నానని చెబుతూ, అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతున్న ఈ మ్యాజిక్‌ను అందరూ తప్పక చూడాలని తారక్ కోరాడు.


