శర్వా గ్యాంగ్ స్టార్ డ్రామా షూటింగ్ లో కాజల్ !

Published on Feb 17, 2019 5:23 pm IST


ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్, ‘స్వామి రారా’ పేమ్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ లో స్టార్ హీరోయిన్ కాజల్ జాయిన్ అయ్యింది. శర్వా -కాజల్ ఫై కొన్ని ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘హలో’ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని మరో హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇంకా ఈచిత్రానికి టైటిల్ ఖరారు కాలేదు.

ఇక ఈ చిత్రంలో శర్వా ద్వి పాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి యువకుడి పాత్ర కాగా మరొకటి వృద్దుడి పాత్రా అని సమాచారం. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :