బిజీ బిజీగా కాజల్, కళ్యాణ్ రామ్ !

కళ్యాణ్ రామ్, కాజల్ గర్వాల్ లు జంటగా నటించిన చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను మొదలుపెట్టింది. అందులో భాగంగా హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇద్దరూ హైదరాబాద్లోని టీవీ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు.

అలాగే ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక కూడ జరగనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని ఉపేంద్ర మాధవ్ డైరెక్ట్ చేయగా మణిశర్మ సంగీతాన్ని అందించారు. 12 ఏళ్ల క్రితం వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం’ సినిమాలో జంటగా నటించిన కాజల్, కళ్యాణ్ రామ్ మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాలో కలిసి నటించారు.