రెండు భారీ ఆఫర్స్ తో తిరిగిరానున్న కాజల్ అగర్వాల్

Published on Dec 30, 2013 7:30 pm IST


ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలు నిజమైతే అందాల భామ కాజల్ అగర్వాల్ రెండు భారీ ప్రాజెక్ట్స్ లో నటించనుంది. ఈ సంవత్సరం మొదట్లో ‘నాయక్’, ‘బాద్ షా’ సినిమాలతో సక్సెస్ అందుకున్న కాజల్ ఈ సంవత్సరంలో మిగిలిన సమయం అంతా రెండు తమిళ సినిమాలకే కేటాయించింది. అందులో ‘అల్ ఇన్ ఆల్ అజుగు రాజా’ విడుదలై పరాజయాన్ని అందుకోగా ‘జిల్లా’ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం కాజల్ రామ్ చరణ్ – కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా కోసం ఎంచుకున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. గతంలో రామ్ చరణ్ – కాజల్ కలిసి మగధీర, నాయక్ సినిమాలతో విజయాన్ని అందుకొని హిట్ పెయిర్ అనిపించుకున్నారు.

మరో వైపు లింగుస్వామి దర్శకత్వంలో కమల్ హసన్ నటించనున్న సినిమాకి అంగీకరించినట్లు సమాచారం. ఈ సినిమాకోసం సౌత్ ఇండియన్ సినిమాలో తనకు ఎవరూ ఆఫర్ చెయ్యని భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాల గురించి కచ్చితమైన సమాచారం వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :