జీ హీరో సరసన కాజల్ అగర్వాల్

Published on Jan 14, 2020 10:00 pm IST

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలు చేయడంలో కొంచెం నిదానించినా కూడా మంచి ప్రాజెక్ట్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఇండియన్ 2’లో నటిస్తోంది ఈమె. ఇందులో 85 ఏళ్ల వృద్దురాలి పాత్రలో కనిపించనుంది. ఇక తమిళంలోనే ఆమెకు ఇంకో క్రేజీ ప్రాజెక్ట్ సెట్టైనట్టు తెలుస్తోంది.

మలయళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా కొత్త తమిళ చిత్రం ఒకటి రూపొందనుంది. ఇందులో కథానాయకిగా కాజల్ కనిపించనుందట. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా తెలిపారు. అయితే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :