డేగల బాబ్జీ నుంచి వచ్చేస్తున్న “కలలే కన్నానే” లిరికల్ సాంగ్..!

Published on Feb 2, 2022 9:00 pm IST

ప్రముఖ నిర్మాత, కమెడీయన్ బండ్ల గణేశ్ తొలిసారి హీరోగా “డేగల బాబ్జీ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ సాధించిన ‘ఒత్త సెరప్పు అళవు-7’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి మంచి రెసాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి రేపు ఉదయం 08:15 గంటలకు “కలలే కన్నానే” లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వాతి చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :