‘కల్కి 2898 ఏడి’ : నేటితో గుమ్మడికాయ కొట్టనున్నారా ?

‘కల్కి 2898 ఏడి’ : నేటితో గుమ్మడికాయ కొట్టనున్నారా ?

Published on Apr 10, 2024 8:35 PM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. నాగ అశ్విన్ తీస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. విషయం ఏమిటంటే, నేటితో ఈ మూవీ యొక్క షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టనున్నారట. ఇక కొద్దిపాటి విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంటుందని, అలానే మూవీని మే 30న రిలీజ్ చేసేందుకు మేకర్ సన్నహాలు చేస్తున్నారని త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ పై అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు