“కల్కి 2898ఎడి” ఈ వెర్షన్ కి కూడా ఓటిటి పార్ట్నర్ లాక్!?

“కల్కి 2898ఎడి” ఈ వెర్షన్ కి కూడా ఓటిటి పార్ట్నర్ లాక్!?

Published on Apr 7, 2024 9:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకున్న చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా దీపికా పదుకోణ్ మరో ముఖ్య పాత్రలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కొత్త డేట్ పై స్ట్రాంగ్ బజ్ ఆల్రెడీ వైరల్ అవుతుండగా దీనికి ముందు ఒక ప్రీల్యూడ్ ని యానిమేషన్ వెర్షన్ లో మేకర్స్ రిలీజ్ చేస్తారని కూడా టాక్ ఉంది.

అయితే దీనికి కూడా ఓటిటి డీల్ ని మేకర్స్ కంప్లీట్ చేసారని తెలిసిందే. మరి దీనిపై మరింత క్లారిటీ ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ యానిమేటెడ్ వెర్షన్ తాలూకా హక్కులని కూడా ప్రపంచ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Kalki 2898AD OTT) వారే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో రిలీజ్ కి ముందే కల్కి మరో వెర్షన్ ఇందులో రానున్నట్టుగా టాక్. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు