కల్కి ట్రైలర్ డైరెక్ట్ గా థియేటర్లలోకి !

Published on May 9, 2019 8:29 am IST

సీనియర్ హీరో రాజశేఖర్ , ‘అవె’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. ఇక ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ ను రాగ ఇక ఇప్పుడు ట్రైలర్ ను విడుదలచేస్తున్నారు.

అయితే ఈ ట్రైలర్ ను డైరెక్ట్ గా థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈరోజు మహేష్ బాబు నటించిన మహర్షి తో భారీ స్థాయిలో విడుదలవుతుందని తెలిసిందే. ఈసినిమా తో పాటు గా కల్కి ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు. దాంతో సినిమా కు కావాల్సిన పబ్లిసిటీ దొరుకుతుందని మేకర్స్ ఇలా ప్లాన్ చేశారు. వాస్తవిక సంఘటనల ఆదరంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత శ్వేతా , ఆదా శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More