లోక నాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘విశ్వరూపం-2’. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం బడ్జెట్ కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు విడుదలకునోచుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 10న విడుదలకానుంది ఈ చిత్రం. విడుదల తేదీ సమీపిస్తుండడంతో చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొననున్నారు కమల్ హాసన్.
దాంట్లో భాగంగా ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘దస్ కా దమ్’ అనే రియాల్టీ షో లో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. తెలుగు , తమిళ, హిందీ భాషల్లో ఒకే సారి విడుదల కానున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ , చంద్ర హాసన్ , వి రవిచంద్రన్ లు సంయుక్తంగా నిర్మించారు.


