షూట్ కి రెడీ అవుతోన్న మెగా అల్లుడు !

Published on Feb 28, 2020 3:01 am IST

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు ‘కళ్యాణ్ దేవ్’ హీరోగా, రచయిత ‘శ్రీధర్ సీపాన’ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 12న నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ‘జిఏ 2 పిక్చర్స్’ సమర్పణలో నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూలరంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి పలు హిట్ చిత్రాలకు కథ, మాటలు అందించిన ‘శ్రీధర్ సీపాన’ మరి ఈ చిత్రం కోసం ఎలాంటి కథాకథనాలను రాశాడో చూడాలి.

ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. ప్రస్తుతం ‘కళ్యాణ్ దేవ్’ నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండువ సినిమాని చేస్తున్నాడు. ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More