వేసవి బరిలోనే మెగాస్టార్ అల్లుడు

Published on Jan 1, 2020 7:18 pm IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి చిత్రంతో నటుడిగా మంచి మార్కులే వేయించుకున్న కళ్యాణ్ దేవ్ ఇటీవలే రెండో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని పులివాసు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ నిర్ణయించారు.

చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి బరిలో నిలపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఖచ్చితమైన విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కళ్యాణ్ దేవ్ సరసన రచిత రామ్ కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కన్నడలో ‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టూ మీనాక్షి’ పేరుతో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :