కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్

కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్

Published on Jan 13, 2024 9:07 PM IST

వెర్సటైల్ యాక్షన్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ డెవిల్ ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అభిషేక్ నామా తెరకెక్కించడంతో పాటు గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రల్లో అజయ్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, సీత, మాళవిక నాయర్ తదితరులు నటించారు.

ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ఉప శీర్షికతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమైంది. కాగా రేపు అనగా జనవరి 14న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ముందుకి రానుంది. ముందుగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో డెవిల్ అందుబాటులోకి రానుండగా అనంతరం మిగతా భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తంగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు