ఇంటర్వ్యూ : కళ్యాణ్ రామ్ – ఈ సినిమాలో హీరో ఏది నెగిటివ్ గా తీసుకోడు.

ఇంటర్వ్యూ : కళ్యాణ్ రామ్ – ఈ సినిమాలో హీరో ఏది నెగిటివ్ గా తీసుకోడు.

Published on Jan 13, 2020 12:58 PM IST

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. కాగా ఈ సినిమా జనవరి 15న విడుదల అవ్వబోతున్న సందర్భంగా కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్ ను మీ పాత్రను బట్టి పెట్టారా లేక టైటిల్ బాగుందని పెట్టారా ?

 

సినిమాలో హీరో క్యారెక్టర్ ను బట్టే టైటిల్ పెట్టాం. ఫస్ట్ డైరెక్టర్ గారు ఈ సినిమాకు ‘ఆల్ ఈజ్ వెల్’ అని పెట్టారు. కానీ తెలుగుదనం ఉన్న టైటిల్ అయితేనే ఈ కథకు పూర్తి న్యాయం జరుగుతుందనే ఫీల్ ను డైరెక్టర్ గారిని అడిగితే.. ఆయన ఈ టైటిల్ ను పెట్టారు.

 

సినిమాలో మీ పాత్ర గురించి ?

 

ఈ సినిమాలో హీరో ఏది నెగిటివ్ గా తీసుకోడు. చిన్నతనంలో అతని జీవితంలో జరిగిన ఓ సంఘటనతో అతను పూర్తి పాజిటివ్ గానే మారతాడు. మిగతావాళ్ళలో కూడా పాజిటివ్ నెస్ ను తీసుకురావడానికి ట్రై చేస్తాడు.

 

కథలో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటి ?

 

మనుషులందరూ మంచివాళ్లు అనే పాయింట్ నే సినిమాలో చూపిస్తున్నాము. అంటే నెగిటివ్ యాంగిల్ ను దూరం చేయడమే బెస్ట్ అనే సెన్స్ ను హైలైట్ చేస్తున్నాము.

 

‘ఎంత మంచివాడవురా’ పూర్తి పాజిటివ్ స్టోరీ కదా. మరి సినిమాలో బలమైన సంఘర్షణ ఏమిటి ?

 

సినిమాలో హీరో క్యారెక్టర్ కు సంబంధించి అతని లైఫ్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఎంటర్ అవుతారు. వాళ్ళ వల్ల అతని లైఫ్ లో వచ్చిన మార్పులు ఏమిటి ? సంఘర్షణ ఏమిటి ? అనే పాయింటాఫ్ వ్యూలో బెస్ట్ కాన్ ఫిల్ట్ ఉంటుంది.

 

గుజరాత్ సినిమా ఆక్సిజన్ సినిమా ఆదారంగానే ఈ సినిమా కథ రాసుకున్నారు. ఆ సినిమా మీకు బాగా నచ్చి ఈ సినిమా చేసారా ?

 

నిజానికి ఆ సినిమా చూసినప్పుడు.. ఆ సినిమా నాకు నచ్చలేదు. కానీ ఆ సినిమాలో కొర్ ఎమోషన్ నాకు చాల బాగా నచ్చింది. అయితే సినిమా మాత్రం రీమేక్ చేయాలనుకోలేదు. ఆ తరువాత మా డైరెక్టర్ గారు ఆ సినిమా కథలో చేసిన మార్పులు విన్నాక ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాము.

 

దర్శకుడు సతీశ్ వేగేశ్నగారి గురించి ?

 

చాల మంచి డైరెక్టర్. ఆయనతో పని చేయడం చాల ఈజీగా అనిపించింది. నాకు ఆయన డైలాగ్స్ బాగా ఇష్టం అండి. చాల బాగా రాస్తారు.

 

ఎన్టీఆర్ గారు మీ సినీ కెరీర్ లో ఏమైనా సలహాలు ఇస్తారా ?

 

ఏ సినిమా చేయబోతున్నాము అనే విషయాలు మాట్లాడుకుంటాము. ఆ సమయంలో కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము కదా. నేను ఇలాంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను చేస్తే బాగుంటుందని తను కూడా ఫీల్ అయ్యాడు.

 

సంక్రాంతి పోటీలో మీ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పోటీ ఎందుకు అనిపించలేదా ?

 

సంక్రాంతి రైతుల పండుగ.. అలాగే మా సినిమా వాళ్లకు కూడా సంక్రాంతి సీజన్ పెద్ద పండుగ. ఎన్ని సినిమాలు వచ్చిన సినిమా బాగుంటే ప్రేక్షుకులు సినిమాని ఆదరిస్తారు. ఈ సినిమాలో మంచి కథ ఉంది ఆ పాజిటివ్ నెస్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు