కళ్యాణ్ రామ్ నటించిన ఎంఎల్ఎ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఆనంది ఆర్ట్స్ సంస్థలో జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ సినిమా తరువాత కెమెరామెన్ గుహన్ సినిమాలో నటించబోతున్నాడు ఈ హీరో.
ఏప్రిల్ మూడోవారం నుండి ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ తరువాత పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతోంది. మల్టి స్టారర్ సినిమాగా తెరకేక్కబోయే ఈ సినిమాలో నటించే మరో హీరో ఎవరనేది త్వరలో వెల్లడి కానుంది. వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్న కళ్యాణ్ రామ్ మంచి విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుందాం.


