
నందమూరి కళ్యాణ్ రామ్ శనివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ హీరో నటించిన తాజా సినిమా ‘పటాస్’ ఘన విజయం సాదించడంతో వీఐపీ ప్రారంభదర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ‘పటాస్’ దిగ్విజయ యాత్రంలో భాగంగా శుక్రవారం కళ్యాణ్ రామ్ మరియు యూనిట్ సభ్యులు తిరుపతిలో సందడి చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంచి కథ దొరికితే బాబాయి బాలకృష్ణ, తమ్ముడు ఎన్టీఆర్ లతో కలిసి నటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వీరు ముగ్గురు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. ఇటివల ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో సైతం నాగార్జున కూడా ఇదే కోరికను వ్యక్తం చేశారు.

