‘పటాస్’ సినిమాతో చాలాకాలంగా ఎదురుచూసిన సూపర్ హిట్ దక్కడంతో హీరో కళ్యాణ్ రామ్ ఆ జోష్‌తో ‘షేర్’ అనే సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కాగా దసరా పండగ రోజున భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సి ఉన్న అఖిల్ సినిమా వాయిదా పడడంతో దసరా సీజన్‌లో ఒకవారం స్లాట్ ఖాళీ అయింది.
ఇక ఈ వారం విడుదలయ్యేందుకు ఇప్పటికే కంచె సినిమా రంగం సిద్ధం చేసుకోగా, షేర్ సినిమా కూడా అదే రోజున విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దసరా పండగకు సినిమా వస్తే కలెక్షన్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో షేర్ టీమ్ అక్టోబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 22వ తేదీకీ సినిమాను తేదీకి మార్చేస్తోంది. ఇదే విషయమై రేపు షేర్ టీమ్ ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనుంది. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను కొమర వెంకటేష్ నిర్మించారు. ఇక తన గత చిత్ర పటాస్‌లో ఓ స్ట్రాంగ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించిన కళ్యాణ్ రామ్, ఈ సినిమాలోనూ అదేస్థాయి పవర్ఫుల్ పాత్రతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు.


