కళ్యాణ్ రామ్ “అమిగోస్” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

Published on Feb 1, 2023 8:49 pm IST


తన కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ని స్కోర్ చేసిన తర్వాత, కళ్యాణ్ రామ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం అమిగోస్‌ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న గ్రాండ్‌గా థియేటర్ల లో విడుదల కానుంది. ప్రొడక్షన్ హౌస్ నుండి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఫిబ్రవరి 3న థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కానుంది.

ట్రైలర్ విడుదల తేదీని తెలియజేయడానికి కళ్యాణ్ రామ్ సిగార్ తాగుతున్న అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో డోపెల్‌గ్యాంజర్‌గా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి నందమూరి నటుడు బింబిసార తర్వాత మరో పెద్ద హిట్ అందిస్తాడో లేదో చూద్దాం.

సంబంధిత సమాచారం :