‘రా’ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ !

Published on Apr 18, 2021 11:02 pm IST

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకం పై ఓ చిత్రం తెరకెక్కనుంది. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణను‌ కూడా పూర్తీ చేసుకుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా ఎమోషనల్ డ్రామా అని.. సినిమాలో కళ్యాణ్ రామ్ ఒక ‘రా’ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. కల్యాణ్‌రామ్‌ చివరిగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంలో నటించారు.

కాగా మైత్రీ సంస్థ ‘ఉప్పెన’చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఇక కళ్యాణ్ రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని.. కళ్యాణ్ రామ్ పాత్ర ఇంటర్వెల్ లో వస్తోందని.. పోలీస్ ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

సంబంధిత సమాచారం :