నవ యుగాన్ని సృష్టిద్దామంటున్న కమల్ !
Published on Feb 20, 2018 1:35 pm IST

నటుడు కమల్ హాసన్ రేపు జరగబోయే తన తొలి రాజకీయ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. రేపు 21వ తేదీ సాయంత్రం మధురైలో ఈ భారీ సభ జరగనుంది. ఈ వేదికపై నుండే కమల్ తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ సందర్బంగా ట్విట్టర్ ద్వారా కమల్ మాట్లాడుతూ ‘మన సుదీర్ఘ ప్రయాణం మొదలవడానికి సిద్ధంగా ఉంది. రేపు సాయంత్రం 6 గంటలకి మధురైలోని ఓతకడై గ్రౌండ్స్ లో వేలాది మంది ప్రజల మధ్యన పార్టీని ప్రకటిస్తాను. అక్కడే పార్టీ పేరును అనౌన్స్ చేసి, ఉద్దేశ్యాలను వివరిస్తాను. అందరం కలిసి నవ యుగాన్ని సృష్టిద్దాం’ అంటూ అభిమానులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే కమల్ తమిళ రాజకీయాల్లో ముఖ్యులైన వారిని కలిసి చర్చలు కూడ జరిపి ఖచ్చితమైన కార్యాచరణతో రాజకీయ రంగంలోకి దిగుతున్నారు.

 
Like us on Facebook