యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఎంతో ముక్కుసూటి మనిషి. ఇలా ముక్కుసూటిగా ఉండడం వలన ఆయన ఇప్పటికే పలు సమస్యలను ఎదుర్కున్నాడు. అయినప్పటికీ ఆయన తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు. రీసెంట్ గా సెన్సార్ బోర్డ్ మెంబర్స్ పై ధ్వజమెత్తిన కమల్ తాజాగా సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన ఓ విషయాన్నీ కూడా ఖండించారు.
ఇక అసలు విషయంలోకి వెళితే ‘లింగ’ సినిమాకి బాగా లాస్ రావడంతో డిస్ట్రిబ్యూటర్స్ గొడవ చేయడంతోకి రిటర్న్ మనీ ఇచ్చి ఇటీవలే సెటిల్ చేసారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రజినీ చేసింది కరెక్ట్ కాదని అన్నారు. కమల్ మాట్లాడుతూ ‘ఈ మధ్య ఫెయిల్ అయిన సినిమాల విషయంలో తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రజినీకాంత్ పంపిణీదారులకు నష్టపరిహారం చెల్లించి ఈ పద్దతికి తెరలేపినా, ఇది అందరూ ఆమోదించదగిన విషయం కాదని’ అన్నారు.
కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్, విశ్వరూపం సినిమాలు వరుసగా రిలీజ్ అవడానికి సిద్దమవుతున్నాయి. మరి కమల్ చేసిన స్టేట్ మెంట్స్ ఎలాంటి ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తాయో చూడాలి.


